ePrivacy and GPDR Cookie Consent by Cookie Consent

What to read after EWS- Reservationlani Antham Chese Kutra?

Hello there! I go by the name Robo Ratel, your very own AI librarian, and I'm excited to assist you in discovering your next fantastic read after "EWS- Reservationlani Antham Chese Kutra" by Sreevani Siddharthi Subhas Chandrabose! 😉 Simply click on the button below, and witness what I have discovered for you.

Exciting news! I've found some fantastic books for you! 📚✨ Check below to see your tailored recommendations. Happy reading! 📖😊

EWS- Reservationlani Antham Chese Kutra

Sreevani Siddharthi Subhas Chandrabose

Social Science / Activism & Social Justice

రిజర్వేషన్‌ అంటే అదనపు అవకాశం. ఈ అసమానతల దేశంలో అనాదిగా అన్ని అవకాశాలను దూరం చేయడమే గాక దోపిడీకీ, వివక్షకూ గురిచేయబడిన కులాధారిత వ్యవస్థలో కిందికులాలకు సామాజికంగా, విద్యాపరంగా అవకాశాలు కల్పించడం ద్వారా ఆర్థిక, రాజకీయ రంగాలలో ప్రాతినిధ్యం కల్పించడం తద్వారా ప్రజాస్వామ్యాన్ని అర్థవంతం చేయడం కోసం రిజర్వేషన్లు ఏర్పాచేయడమైంది. రాజ్యాంగంలోని 15, 16 ఆర్టికల్స్‌ ప్రాతిపదికగా వచ్చిన రిజర్వేషన్లు, న్యాయస్థానాల తీర్పులు, పార్లమెంటు చట్టాలు, పరిపాలనా విధానాల మీదుగా విస్తరించి ఇప్పుడీ స్థితిలో వున్నాయి. అయితే ఇక్కడ కీలక విషయం ఏమంటే, అందరూ అనుకునేటట్లు రిజర్వేషన్లు అనేవి ఆర్థిక సదుపాయాలు కాదు, వాటికోసమైతే రిజర్వేషన్లు అవసరం లేదు, పేదరిక నిర్మూలనా పథకాలు సరిపోతాయి.

అయితే ఆర్థిక ప్రాతిపదికన రిజర్వేషన్లను గుర్తిస్తూ 124వ రాజ్యాంగ సవరణ బిల్లుగా ప్రవేశపెట్టబడి పార్లమెంటుచే ఆమోదింపబడి 103వ రాజ్యాంగ సవరణ ద్వారా చట్టంగా రికార్డుస్థాయిలో రూపొందించబడి వెనువెంటనే అమలులోకి వచ్చింది. అన్ని పార్టీలు మూకుమ్మడిగా మద్దతిచ్చిన ఈ చట్టం తాలూకు చెల్లుబాటు గురించి ప్రాధమిక అభ్యంతరాలు ఎవరూ పట్టించుకోలేదు, అది అత్యంత వేగంగా అంటే 48గంటలలోగా బిల్లు పాసయిన కారణంగా. ఇప్పుడు ఈ చట్టంగా రూపొందిన ఈ బిల్లు పలు రకాల అభ్యంతరాలకు, వివాదాలకు తెరలేపింది. ఈ బిల్లు చట్టంగా రూపొందిన విషయం రిజర్వేషన్ల మీదనే గాక రాజ్యాంగ మౌలిక పునాదుల మీదనే దాడిగా పరిగణించిన నేపథ్యంలో రిజర్వేషన్ల పరిరక్షణకోసం, రాజ్యాంగ విలువల కోసం మేధావులూ, అకడమీషియన్లూ, విషయ పరిశోధకులు, రాజనీతిఙ్ఞులూ, రాజకీయ వేత్తలూ, రాజ్యాంగ నిపుణులతో అత్యవసర సమావేశాలు ఏర్పాటయ్యాయి, చర్చలు, ప్రసంగాలు జరిగాయి. ఇవి ఆంగ్లంలో అక్షర రూపంలో వచ్చాయి. వీటికి తెలుగు అనువాదమే ఈ పుస్తకం.

ఈ తెలుగు అనువాదంలో ఇందాక చెప్పినట్లు మేధావుల, అకడమీషియన్‌ల, రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు లోతుగా వుండడం వాటిని యధాతథంగా చదువరికి అందించడం వల్ల ఏర్పడే ఇబ్బందుల్ని పరిశీలనలోకి తీసుకోవడం జరిగింది. అలాగని ఆయా మేధావుల అభిప్రాయాలలోని ఒక్క పదం కూడా పరిహరించడం లేదా సవరించడం అంటే అది వారిని, వారి అభిప్రాయాన్ని విలువివ్వకపోవడంగా గుర్తించడమైనది.

అయితే పుస్తకానికి మరింత ప్రామాణికతను పెంచడానికి, కాలాతీత విలువను నిలబెట్టడానికి చిన్న చిన్న వ్యక్తిగత పదాల్ని కూడా వస్తుగతం చేయడం మాత్రం జరిగింది. సంక్లిష్ట, సంయుక్త వాక్యాలను తగ్గించడం కోసం వాటిని విడదీసి సామాన్య వాక్యాలు చేయడం జరిగింది. మొత్తానికి ఈ సందర్భంలో పాఠకుడికి చేసే విన్నపం ఏమంటే, కొంచెం స్థాయిని పెంచుకుని ఈ పుస్తకాన్ని చదవమని.

పుస్తకంలోని రచయితలు ఒక్కొక్కరు ఒక్కో అంశంలో అంటే శాసన, కార్యనిర్వాహక మరియు న్యాయ రంగాలలో ఎలా రాజ్యాంగ స్పూర్తికి, రిజర్వేషన్ల అమలుకు తూట్లు పొడవడం జరిగిందో వివరించడం, అలాగే మొత్తం రాజ్యాంగ స్పూర్తిని నిలబెట్టడానికి ఆయా రంగాలే ప్రముఖంగా పాత్ర పోషించాలని రాయడం వల్ల ఒక్కోసారి పాఠకుడికి సందిగ్ధత కలగవచ్చు. అయితే వీటన్నిటినీ సంవిధాన పరచుకొని చదవడం వల్ల, ప్రతిరంగమూ తనదైన పాత్రపోషించి మొత్తానికి రాజ్యాంగ స్ఫూర్తిగా నిలపాలని అర్థం  చేసుకోవాలి.

 

ఈ పుస్తకం ఇలా మీ చేతుల్లోకి రావడానికి కారణమైన వారందరికీ ఆత్మీయ ఆలింగనాలతో,

మీ

- శ్రీవాణీ సిద్దార్థి సుభాస్‌ చంద్రబోస్‌.


Do you want to read this book? 😳
Buy it now!

Are you curious to discover the likelihood of your enjoyment of "EWS- Reservationlani Antham Chese Kutra" by Sreevani Siddharthi Subhas Chandrabose? Allow me to assist you! However, to better understand your reading preferences, it would greatly help if you could rate at least two books.