ePrivacy and GPDR Cookie Consent by Cookie Consent

What to read after HasyaVallari?

Hello there! I go by the name Robo Ratel, your very own AI librarian, and I'm excited to assist you in discovering your next fantastic read after "HasyaVallari" by Kothapalli RaviKumar! 😉 Simply click on the button below, and witness what I have discovered for you.

Exciting news! I've found some fantastic books for you! 📚✨ Check below to see your tailored recommendations. Happy reading! 📖😊

HasyaVallari

Antuleni Navvula Jhari

Kothapalli RaviKumar

Fiction / Fantasy / Humorous

మనిషి పలికే అన్ని రసాలలోకి హాస్యరసం అత్యంత ప్రధాన మైనది, ఉత్తమమైనది. ఎందుకంటే మనుషుల్ని, జంతువుల్ని వేరుగా చూపబడేది ఈ హాస్యరసమే! జంతువులన్నీ మనుషుల్లాగా అన్ని రసాలను పలికించగలవేమో గానీ హాస్యాన్ని మాత్రం పండించలేవు. హాస్యాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడం, దానికనుగుణంగా కడుపారా నవ్వుకోవడం ఒక్క మానవునికే చెల్లింది. నవ రసాలలో మనకు ఆరోగ్యాన్నిచ్చేది మాత్రం హాస్యరసమే.

అలాంటి హాస్యం (నవ్వు) మన జీవితంలో కీలకపాత్ర పోషిస్తుందని వైద్యులు, మానసిక నిపుణులు తరచుగా చెబుతూనే ఉంటారు. చేసే పనిలో ఒత్తిడిని అధిగమించడానికైనా, సంసారంలో చోటు చేసుకునే ఈతి బాధలను తట్టుకోవడానికైనా, మానసిక, శారీరిక వ్యాధులను మాన్పటానికైనా ఒకే ఒక్క నివారిణి ఈ హాస్యరసం. హాస్యాన్ని ఆస్వాదిస్తూ బాధలను బంద్ చేసేయచ్చనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.

నవ్వితే నవరత్నాలు రాలతాయో లేదో కానీ.. నవ్వితే శరీరంలోని 108 కండరాలు ఉత్తేజితమై శక్తి వస్తుంది. నవ్వితే ముఖంలో కండరాలు ప్రత్యేకమైన బ్రెయిన్ న్యూరో ట్రాన్స్‌మీటర్లను ఉపయోగించుకుంటాయి. చాలామంది నిపుణులు చెప్పేదేంటంటే, నవ్వుతో రోగ నిరోధక శక్తిని కూడా పెంచుకోవచ్చునని. మనస్ఫూర్తిగా నవ్వడం వలన సంతోష పూరిత హీలింగ్ హార్మోన్లు విడుదల అవుతాయి. అందుకే నవ్వడం వల్ల నిత్య యవ్వనంగా కనిపిస్తారు. గట్టిగా నవ్వడం వల్ల మన శరీరానికి ఆక్సిజన్ బాగా అందుతుంది. దీనివల్ల గుండె సంబంధిత రోగాలు దరిచేరవు. అందుకే ఇప్పుడు చాలా చోట్ల లాఫింగ్ క్లబ్ లు విరివిగా వెలుస్తున్నాయి. డిప్రెషన్‌లో ఉన్నవాళ్లకు లాఫింగ్ థెరపీ ట్రీట్‌మెంట్ చేయగా 70 శాతం వరకు సత్ఫలితాలు ఇచ్చాయని ప్రముఖ వైద్యుల రిపోర్ట్. అందుకే బాధలన్నీ పక్కన పెట్టేసి హాయిగా నవ్వేద్దాం!

"నవ్వడం ఒక భోగం, నవ్వించడం ఒక యోగం, నవ్వకపోవడం ఒక రోగం" అని హాస్యబ్రహ్మ జంధ్యాల గారు ఏనాడన్నారో గానీ అది అక్షర సత్యం. నవ్వడానికైనా, నవ్వించడానికైనా పెట్టి పుట్టాలి. అలాగని నవ్వించడం అంత సులభమేమీ కాదు. హాస్యాన్ని పండిస్తూ అవతలి వాడిని ఆసాంతం నవ్వించగలగడం నిజంగా ఒక అపురూపమైన కళ.  

సరైన హాస్యానికి కథా వస్తువు ఎక్కడినుండో రాదని నా భావన. ప్రతీరోజూ మనం చూసే మనుషులలోనో, చేసే చర్యలలోనో, దారి తీసే పరిస్థితుల లోనో ఎక్కడో ఒకచోట, ఏదో ఒక మూలన హాస్యం పుడుతూనే ఉంటుంది. దానిని మనం చాకచక్యంగా సంగ్రహించి, మంచి రూపంలో మలచుకోగలిగితే అద్భుతమైన హాస్యం పుడుతుంది.

అలాగని ఆ హాస్యం అపహాస్యం కాకుండా చూసుకోవాలి. అవతలి వాడి అవిటితనాన్ని హేళన చేస్తూనో, పక్కవాడి పనికిమాలినతనాన్ని హైలెట్ చేస్తూనో హాస్యం పండించడం అంత ఆరోగ్యకరమైన హాస్యం అనిపించుకోదు. ఎవరు నొచ్చుకున్నా నేను మాత్రం ఒక్కటి చెప్పదలుచుకున్నాను. ఈరోజుల్లో ఎక్కువుగా ఇలాంటి హాస్యమే మనము ఎక్కువ చూస్తున్నాము. ఇంకా చెప్పాలంటే వినడానికి కూడా అసహ్యం వేసే వల్గర్ సంభాషణలనే హాస్యమని వ్రాస్తున్నారు, చూపిస్తున్నారు. ఇది నిజమైన హాస్యం కాదు.

అసలు సిసలైన హాస్యాన్ని పండించి మనల్ని కడుపుబ్బా నవ్వించే రచయితలు, కథకులు ఇప్పటికీ లేకపోలేదు. వారి వారి పదునైన, శాస్త్రీయమైన, ఆరోగ్యకరమైన హాస్యాన్ని పండిస్తూనే ఉన్నారు. మనల్ని నవ్విస్తూనే ఉన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకుని అసభ్య పదజాలాలు లేని స్వచ్ఛమైన హాస్యాన్ని అందించడానికి పూనుకున్నాను. ఆ హాస్యంతోనే ఈ "హాస్య వల్లరి" ని మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. నా పరిధి మేరకు మంచి హాస్యాన్నే అందించానని నేను అనుకుంటున్నాను. ఇందులో హాస్య కథలతో పాటు నానో హాస్య కథలు కూడా అందించడం జరిగింది. మీరు నా ఈ "హాస్య వల్లరి" ని చదివి, మీరు మనసారా ఆనందింది, తద్వారా కలిగే మీ నవ్వుల ఆశీస్సులు నాకందిస్తారని ఆశిస్తూ......

 

మీ

కొత్తపల్లి రవి కుమార్


Do you want to read this book? 😳
Buy it now!

Are you curious to discover the likelihood of your enjoyment of "HasyaVallari" by Kothapalli RaviKumar? Allow me to assist you! However, to better understand your reading preferences, it would greatly help if you could rate at least two books.