ePrivacy and GPDR Cookie Consent by Cookie Consent

What to read after EVEREST IN MIND (TELUGU)?

Hello there! I go by the name Robo Ratel, your very own AI librarian, and I'm excited to assist you in discovering your next fantastic read after "EVEREST IN MIND (TELUGU)" by Sudheer Reddy Pamireddy! 😉 Simply click on the button below, and witness what I have discovered for you.

Exciting news! I've found some fantastic books for you! 📚✨ Check below to see your tailored recommendations. Happy reading! 📖😊

EVEREST IN MIND (TELUGU)

Sudheer Reddy Pamireddy

Nature / Ecosystems & Habitats / Mountains

"ఒకసారి రంగుల రెక్కలు తగిలించుకుని

సీతా కోక చిలుకనై 'నా' వెంట నేనే పడ్డాను

ఆకుల్లో మునిగి రామచిలుకనై

'నా' పండు నేనే తిన్నాను.

ఇదంతా నాజీవిత యాత్ర" అంటారు గుంటూరు శేషేంద్ర శర్మ ఒక కవిత చెబుతూ...

తన రెక్కలు తానే తొడుక్కుని సీతా కోక చిలుకలా "పాకల" గ్రామం నుండి ఎవరెస్ట్ శిఖరం వరకు ఎగిరిన మాలావత్ పూర్ణ యధార్థ యాత్రా కథే ఈ పుస్తకం.. " ఎవరెస్ట్ ఇన్ మైండ్ ".

పూర్ణ ఒక బంజార బాలిక. తను చిన్నప్పుడు అడవిలో తప్పిపోవడంతో ఈ కథ మొదలై ఎవరెస్టు శిఖరాగ్రానికి చేరడంతో ముగుస్తుంది. 'ఎవరెస్టు ' ను మనసున ముద్రించుకున్న పూర్ణ జీవితంతో అడవి నుండి శిఖరం వరకూ గల ప్రస్థానాలను హృదయ మనోహరంగా అక్షరబద్ధం చేశారు రచయిత శ్రీ పామిరెడ్డి సుధీర్ రెడ్డి .

దేవీదాస్ తప్పిపోయిన తన బిడ్డను వెతుక్కుంటూ వెళ్ళి అడవిలోని ఒక చెట్టు పైకి గోచి బిగించి చిటారు కొమ్మకు ఎగబాకుతాడు. పూర్ణ సాధించే భవిష్యత్ విజయానికి ప్రారంభ సూచికగా ఆ సన్నివేశం అనిపిస్తుంది. తరతరాలుగా వింటూ వచ్చిన బంజారాల చరిత్రను పిల్లలకి కథలు కథలుగా చెబుతుంటాడు దేవిదాసు. ఈ సంధర్భాన్ని రచయిత చాలా స్వేచ్ఛగా వినియోగించుకున్నారు. వందల యేళ్ళు బంజారా బతుకుచిత్రాన్ని హృద్యంగా ఆవిష్కరించారాయన.

శ్రీ సుధీర్ రెడ్డి తనలోని చరిత్రకారుడిని , సామాజిక వేత్తని ఎక్కడా దాచుకోని వైనం కనిపించింది. చారిత్రక విభాతసంధ్యల మానవకథా వికాసాన్ని మానవీయ కోణంలో ఆవిష్కరించారాయన. దేవీదాస్ పాత్ర రచయితకి , పూర్ణకి మధ్య వారధిలా కనిపిస్తుంది ఈ పుస్తకంలో పలుచోట్ల.

తమ ఉనికినీ, సంపదనీ పోగొట్టుకున్నా జీవన విధానాన్ని, సంస్కృతిని విడిచిపెట్టని వ్యక్తిత్వాన్ని, బంజారాల అస్థిత్వ శిల్పాన్ని అందంగా చెక్కు కుంటూ పోయారు రచయిత.

ఆకాశం తాకే ఏ మేడకైనా ఆధారం లేదా ఈ నేలపై అంటారు.. సిరి వెన్నెల సీతారామ శాస్త్రి. బిడ్డని ఉన్నత స్థాయికి ఎదగమని చెప్పి ప్రోత్సహించే వ్యక్తులుగా దేవీదాస్ , భాట్ లు కనబడతారు. కష్టమొచ్చినపుడు పచ్చని అడవి తల్లిని తల్చుకోమని చెప్పినపుడు గుండెనిండా ఊపిరి పీల్చుకుంటుంది పూర్ణ. సంక్షేమ హాస్టల్‌కి చేరిన పూర్ణ జీవితం మరో మలుపు తీసుకుంటుంది. S.R శంకరన్‌ గారి ఆశయాలను, జీవితాన్ని ఆర్తుల కోసం ధారపోసిన వైనాన్ని ఈ సందర్భం గా మన కళ్ళముందుంచారు రచయిత.

ఈ దేశంలో కడపటి వారిని చెయ్యి పట్టుకొని ముందుకు తీసుకువచ్చిన బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ స్పూర్తితో ఎదిగి, వ్యవస్థకి ఎదో మంచి చేయాలని తపనపడే ఉన్నతాధికారి గా ఆర్.యస్. ప్రవీణ్ కుమార్ కనిపిస్తారీ పుస్తకంలో. ట్రెకింగ్, మౌంటనీరింగ్ ల వైపు పూర్ణని నడిపిస్తారాయన. అది మరో మలుపు.

ట్రెకింగ్ కి బయలుదేరిన దగ్గరనుండి ప్రతి అంశాన్ని వాస్తవికంగా మన కళ్ళ ముందుంచుతారు రచయిత. ఆహారపు అలవాట్లు, భౌతిక శిక్షణ, వ్యాయామం వంటి అంశాలపై విశేషమైన విషయ సేకరణ చేయడం కనిపిస్తుంది. ఎవరెస్టు శిఖరాన్ని మనసులో ముద్రించుకొన్న పూర్ణతో పాటుగా మనల్ని కూడా మరో చేత్తో పట్టుకుని ఎవరెస్ట్ వైపు నడిపిస్తారు చదువుతున్నంత సేపూ ....

రెనాక్ పర్వతంపై కోడిని పోలిన హిమాలయన్‌ నెమలి అందానికి పిల్లలందరూ మంత్ర ముగ్ధులయ్యారని చెబుతారు రచయిత.పుస్తక ప్రారంభంలో అడవిలో ఒక నెమలి నాట్యాన్ని చూస్తూ తప్పి పోతుంది పూర్ణ. అక్కడ తప్పిపోయింది పూర్ణ లోని బేలతనం, తరతరాలు తమ జాతి ఎదుర్కొన్న అవమానభరిత అవరోధం. అక్కడి నుండి దేవిదాసు తన భుజాన మోసుకొచ్చింది పూర్ణని కాదు తన జాతి కీర్తి పతాకని ..... మళ్ళీ హిమాలయన్‌ నెమలి పాఠకుడికి మరో విజయ సూచికలా కన్పిస్తుంది.

పూర్ణ వెంట నడిచి, ఆమె విజయానికి దోహద పడిన వారందరి పేరు పేరునా ప్రస్తావించారు రచయిత. వారందిరికి పూర్ణ విజయంలో భాగం పంచారు. సప్త వర్ణ శోభితమైన హిమాలయ శిఖర వర్ణన ఒక అద్భుతం . ఆకాశంలో నక్షత్రాలను చూస్తూ తన విజయ వార్తని అమ్మా నాన్నలకి చేరవేసే నక్షత్రమేదోనని పూర్ణ ఆలోచిస్తుంది అని రచయిత రాస్తారొక చోట.

" చీకటి పడుతోంది 

చిటారు కొమ్మలో నక్షత్రం చిక్కుకుంది.

శిథిల సంధ్య గగనం రుధిరాన్ని కక్కుతుంది.

దారంతా గోతులు ఇల్లేమో దూరం

చేతిలో దీపం లేదు , ధైర్యమే ఒక కవచం"

అంటూ తిలక్ కవితాత్మకంగా చెప్పిన వాక్యాలు గుర్తొచ్చాయి నాకు.

మంచు వసంతం, నింగికి నిచ్చెనలు అధ్యయాలు శ్రీ సుధీరరెడ్డి రచయితగా మరో పది మెట్లిక్కించాయి. ప్రతి సన్నివేశాన్ని దృశ్యం గా తీసుకు వచ్చి మన హృదయానికి తగిలించేశారు. తానే స్వప్నం వాకిట కాలు కదిపిందో , తానే స్వర్గం ముంగిట కాలు మోపిందో పూర్ణ కి బాగా తెలుసు. బేస్ క్యాంప్ మొదలు ఎవరెస్ట్ శిఖరం వరకూ ఆమె ముందర తలవంచిన ఒక్కో శిఖరం తరతరాలు గా బంజారాల తలలు వంచిన ఒక్కో అవరోధంగా కన్పించాయి.

కాకతీయ సామ్రాజ్య విశేషాలు మొదలుకొని కొలంబస్ ఉదంతం, శిఖరప్రస్థానం వరకూ అన్ని అంశాలను రచయిత శ్రీ సుధీర్‌ రెడ్డి అద్భుతమైన శైలితో, వచన శిల్పంతో పుస్తకాన్ని శిఖరాయమానం చేశారు. వారికి హృదయ పూర్వ క అభినందనలు. ఎవరెస్ట్ ని ముద్దాడిన పూర్ణ యావత్ ప్రపంచానికి అందించిన సందేశ మొకటే .... చరిత్రలో అణగదొక్కబడిన వారంతా ఏదో ఒక రోజు ఉవ్వెత్తున ఎగసిపడగలరని.

ఈ సంధర్భంగా విశ్వంభరలో డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు రాసిన కవితని పూర్ణకి అభినందనపత్రంగా అందిస్తున్నాను.

బురద నవ్వింది కమలాలుగా ....

పువ్వు నవ్వింది భ్రమరాలుగా.....

పుడమి కదిలింది చరణాలుగా ....

జడిమ కదిలింది హరిణాలుగా ....

నీటికి రెక్కలు మొలిచి నింగినందుకుంది.

నింగికి అడుగులు కదిలి నేల నందుకుంది.

మిత్రమా ! నీ రాకతో ధాత్రి. నవచైతన్య గాత్రి.

విజయోస్తు.

-- మీ...

గజ్జెల దుర్గారావు,

కథారచయిత,రీసెర్చ్ స్కాలర్  

Do you want to read this book? 😳
Buy it now!

Are you curious to discover the likelihood of your enjoyment of "EVEREST IN MIND (TELUGU)" by Sudheer Reddy Pamireddy? Allow me to assist you! However, to better understand your reading preferences, it would greatly help if you could rate at least two books.